FbTelugu

మాట తప్పిన పతంజలి

డెహ్రడూన్: పతంజలి ఆయుర్వేద కంపెనీ మాట మార్చింది. కరోనా కిట్ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని ఇవాళ కేంద్రానికి వివరణ ఇచ్చింది.
కరోనాకు మందు కనుగొన్నామని ప్రచారం చేసుకున్న పతంజలి ఆయుర్వేద కంపెనీ యూ టర్న్ తీసుకున్నది. యోగా గురువు రామ్ దేవ్ బాబా ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని పతంజలి ప్రధాన కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరోలిన్ మందు కనిపెట్టినట్లు ప్రకటించారు.
వంద మంది రోగులపై ఈ మందు ప్రయోగించగా, వారిలో 65 శాతం మంది కోలుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మందుపై ఆరోపణలు రావడంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విక్రయాలు నిలిపివేయాలని, ప్రకటనలు జారీ చేయవద్దని స్పష్టం చేస్తూ, నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

మేము ఎలాంటి మందు తయారు చేయలేదు, విక్రయించడం లేదని పతంజలి ఆయుర్వేద కంపెనీ కేంద్రానికి వివరణ ఇచ్చింది. కరోనా చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎక్కడా ప్రచారం చేయలేదని స్పష్టం చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.