FbTelugu

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లో పాస్ పోర్టు నెంబర్

న్యూఢిల్లీ: ఇండియా కరోనా వ్యాక్సిన్ తీసుకుని విదేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి టికెట్లు లభ్యం కావడం లేదు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లో పాస్ పోర్టు నెంబర్ ఉంటే తప్ప అంగీకరించడం లేదు.
పాస్ పోర్టుకు కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ జతచేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించారు. కోవిన్ ఫోర్టల్ లో లాగిన్ అయి పాస్ పోర్టు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సర్టిఫికెట్ లోని పేరు, పాస్ పోర్టు పేరుతో సరిపోలక పోతే సర్టిఫికెట్ స్వల్ప మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.

వ్యాక్సినేషన్‌కు సంబంధించి కొద్దిరోజుల క్రితం కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు, భారత్‌ తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే వారు వ్యాక్సిన్ సర్టిఫికెట్, పాస్‌పోర్టులకు అనుసంధానించుకోవాలని కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.