FbTelugu

జూన్ 1 నుంచి ప్యాసింజర్ రైళ్లు

హైదరాబాద్: బస్సులు, ఆటోలు, క్యాబ్ లకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్యాసింజర్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నది.

ఏసీ రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ సామాన్య ప్రయాణీకుల కోసం జూన్ 1వ తేదీ నుంచి ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతున్నది. ప్రతిరోజు 200 నాన్- ఏసీ సెకండ్ రైళ్లు జూన్ 1వ తేది నుంచి తిరుగుతాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అయితే ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని ఆయన సూచించారు.

దేశంలోని ప్రతి ఒక్కరికి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ కూడా తెలిపింది. కాగా కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లు ప్రయాణాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రైళ్లను నడపడం వలన కరోనా విజృంభణ మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు ముఖ్యమంత్రులు అభ్యంతరం తెలపడంతో వాయిదా వేసుకున్నది.

You might also like