FbTelugu

జూన్ 30 వరకు ప్యాసెంజర్ రైళ్లు రద్దు

ఢిల్లీ: అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే లాక్‌డౌన్‌ సమయంలో ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడపనున్నారు. రిజర్వేషన్లు చేసుకున్న వారికి ఛార్జీలు తిరిగి చెల్లిస్తామన్నారు. కరోనా మరితంగా వ్యాప్తి చెందడంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్యాసింజర్, మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్ వంటి అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది.

ఆన్‌లైన్‌ లేక రైల్వే కౌంటర్లలో ఇప్పటికే ప్రయాణికులు రిజర్వేషన్లు చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో చెల్లించిన ప్రయాణికుల ఖాతాలకు తిరిగి ఆ డబ్బును జమ చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కౌంటర్‌లలో రిజర్వేషన్లు చేయించిన వారికి కూడా ఆన్‌లైన్‌లోని పలు రూపాల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తారు.

You might also like