FbTelugu

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికురాలు మృతి

హైదరాబాద్: ఓ ప్రయాణికురాలు విమానం ఎక్కుతూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన నగరంలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కోల్ కతాకు చెందిన జశోధ అనే మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి తిరుపతి వెళ్లే క్రమంలో.. జశోధ విమానం ఎక్కుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

గమనించిన ఎయిర్ పోర్ట్ ఆధికారులు కుటుంబ సభ్యులు హుటాహుటీనా ఎయిర్ పోర్ట్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ పరిస్థితి విషమించి జశోధ మృతి చెందింది. మృతురాలు క్యాన్సర్ తో బాదపడుతునట్లు తెలిపారు.

You might also like