ఢిల్లీ: స్పెషల్ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు నిఘా పెట్టింది. ఈనెల 12వ తేదీ నుంచి ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే.
ఆన్లైన్ ద్వారానే టికెట్లు విక్రయిస్తున్న ఐఆర్ టీసీ ప్రతి ప్రయాణీకుడి అడ్రస్ ను ముందుగానే సేకరిస్తున్నది. ఈ విధానం మూలంగా రైలులో వెళ్లిన ప్రయాణీకుడు ఏ ప్రాంతానికి వెళ్లాడు, ఆ ప్రాంతంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. 13వ తేదీ నుంచి ప్రయాణికుల చిరునామాలను సేకరిస్తున్నారు. అయితే ప్రత్యేక రైళ్లు, శ్రామిక్రైళ్లు మినహా 2020 జూన్ 30 వరకు బుక్ చేసుకున్న అన్ని టికెట్లను రైల్వేశాఖ రద్దు చేశారు. జూన్ 30వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులందరికీ టికెట్ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాలో వేయనున్నట్లు ప్రకటించింది.