FbTelugu

పరీక్ష లో ఫెయిల్ ప్రేమలో పాస్!

పాట్నా: పరీక్ష లో ఫెయిల్ అయినా ప్రేమ పరీక్షలో పాస్ అయింది ఒక యువతి. టెన్త్ క్లాస్ పరీక్ష రాయడానికి ఇంటి నుంచి వెళ్లిన యువతి ప్రేమికుడిని పెళ్లాడి ఏకంగా ఇంటికే తీసుకువచ్చింది. ఈ ఘటన కతిహార్ జిల్లాలో జరిగింది.

మణిహారి ప్రాంతానికి చెందిన గౌరికి నాలుగు సంవత్సరాల క్రితం ఒక మిస్స్ డు కాల్ వచ్చింది. మిస్స్ డు కాల్ చేసిన వ్యక్తి నితీష్ తో మాటామాటా కలిసి రోజు మాట్లాడుకుంటున్నారు. అలా నాలుగు సంవత్సరాల పాటు మాట్లాడుకున్న వీరు ప్రేమలో పడిపోయారు. ఇరు కుటుంబాలకు తెలియచేయడంతో వ్యతిరేకించారు. శనివారం నాడు యువతి పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లింది. పరీక్ష రాసేందుకు లోనికి వెళ్లకుండా తన కోసం అక్కడే ఉన్న నితీష్ తో కలిసి ఆలయానికి వెళ్లింది. పోలీసుల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకుని అక్షింతలు వేయించుకున్నారు. పోలీసుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు.

పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్ కు పలిపించి నచ్చ చెప్పారు. ఇద్దరూ మేజర్లేనని, ఇష్ట ప్రకారం చేసుకున్నారని తెలిపారు. ఆ తరువాత గౌరి తన భర్త నితీష్ ను తీసుకుని ఇంటికి వెళ్లింది. పరీక్షలో ఫెయిల్ అయినా ప్రేమలో పాస్ అయ్యానని గౌరి చెప్పింది. సప్లిమెంటరీ పరీక్ష రాసి టెన్త్ పాస్ అవుతానని తెలిపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.