FbTelugu

గ్రేటర్ హైదరాబాద్ లో పాస్ తప్పనిసరి: డిజిపి

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో తిరగాలంటే పాస్ తప్పనిసరి తీసుకోవాలని డిజిపి ఎం.మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ నుంచి సైబరాబాద్ వెళ్లాలంటే ఈపాస్ తీసుకోవాల్సిందేనని అన్నారు.

ఇవాళ మహేందర్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాలలో అమలవుతున్న లాక్ డౌన్ ను పరిశీలించారు. ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ వెళ్లాలంటే పాసు ఉండాలని, లేనట్లయితే వారి వాహనాలు సీజ్ చేస్తారని ఆయన తెలిపారు. ఈ కామర్స్ సంస్థలకు షరతులతో కూడి అనుమతులు ఇచ్చామన్నారు. కేవలం కరోనా రోగులకు ఆహారం, మందుల సరఫరాకు అనుమతించామన్నారు. జోమాటో, స్విగ్గీ లాంటి సంస్థలు కూడా అర్థం చేసుకోవాలన్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు ఎలాంటి ఆటంకం కల్పించడం లేదని, ధాన్యం కొనుగోలుకు ఏ విధమైన ఆంక్షలు లేవన్నారు. ఎవరు కూడా అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని, లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఈ పాసు కలిగి ఉండాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.