FbTelugu

త్వరలో పార్లమెంటు సమావేశాలు

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీలు భౌతిక దూరం పాటిస్తూ పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలు జరగనున్నాయి.
జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉందంటుని లోక్‌సభ, రాజ్యసభలు వర్గాలు తెలిపాయి. ఆన్ లైన్ లో సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్నారు.

పార్లమెంట్‌ వర్ష కాల సమావేశాల నిర్వహణకు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్‌ కు లోకసభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. కరోనా నేపథ్యంలో ఎంపీలు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్‌సభ, రాజ్యసభతోపాటు పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

You might also like