FbTelugu

కరోనా తరువాతే పార్లమెంటు: వెంకయ్య

ఢిల్లీ: దేశంలో ‘కరోనా’ పరిస్థితులు కుదుటపడిన తర్వాతే పార్లమెంట్ సమావేశాల షెడ్యూలు ప్రకటిస్తారని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.

‘మిషన్ కనెక్ట్’ లో భాగంగా రాజ్యసభ సభ్యులతో ఈరోజు ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పరిశీలించిన అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇవాళ ,‘మిషన్ కనెక్ట్’ లో భాగంగా మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, రాజకీయ నేతలతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. అందులో భాగంగానే రాజ్యసభ సభ్యులతో ఆయన మాట్లాడారు.

You might also like