FbTelugu

కోర్టు తీర్పు తరువాతే పరిషత్ ఎన్నికలు: ఎస్ఈసీ

విజయవాడ: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నీలం సాహ్ని కోరారు.

ఇవాళ ఎస్ఈసీ కార్యాలయం నుంచి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరయ్యారు. జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై రేపు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికలపై కోర్టులో కేసు పెండింగ్ ఉన్నందున ఎన్నికల నిర్వహణపై ఆమె సమాలోచనలు జరిపారు. కోర్టు తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియ కొనసాగిద్దామన్నారు. పరిషత్ ఎన్నికల పిటిషన్లపై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ నెల 3న తీర్పు వెలువరించే అవకాశం ఉంది. తీర్పు వచ్చాకే ఎన్నికల ప్రక్రియపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.