FbTelugu

పేపర్ మాస్క్… ప్రపంచ దేశాల ఆసక్తి!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన నితిన్ వాసు తయారు చేసి పేపర్ సీడ్ మాస్క్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పర్యావరణ హితంగా తయారు చేసిన ఈ మాస్క్ పై పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.

మంగళూరు నగర శివారులోని కిన్నిగోళికి సమీపంలోని పక్షతీర్థంలో నితిన్ నివాసం ఉంటున్నాడు. మాస్కుల మూలంగా చెత్త పోగవుతున్నది. ఈ సమస్య నుంచి పుడమి తల్లిని రక్షించేందుకు నిత్ వినూత్న ఆలోచన చేశాడు. వాడిన తరువాత పడేస్తే మొక్కలుగా మొలకెత్తే విధంగా తయారు చేయాలని నిర్ణయించాడు. నూలు గుడ్డను పల్ప్ గా మార్చి షీట్ గా తయారు చేస్తారు. 12 గంటల పాటు ఆరబెట్టి మాస్క్ తయారు చేస్తాడు. మాస్క్ వెనకాల కాటన్ గుడ్డ అతికించి, మాస్క్ దారాలను కూడా సైతం పత్తితోనే రూపొందించాడు. దీనిలో తులసితో పాటు పదికి పైగా ఔషధ, కూరగాయల విత్తనాలను ఉపయోగించారు. వీటిని ఉపయోగించిన తరువాత పడేసిన తరువాత నేలపై మొక్కలుగా మొలకెత్తుతాయి. పూర్తిగా పర్యావరణ హితంగా రూపొందించిన మాస్క్ ఒక ధర రూ.25 మాత్రమే. ఇంత తక్కువ ధరలో రూపొందించడంపై అమెరికన్ మీడియా కూడా ఆసక్తి చూపిస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.