FbTelugu

తిరుపతి ఎన్నికపై రెఫరెండం: మంత్రి రామచంద్రారెడ్డి

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికను మేము రెఫరెండం గా తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. ఎంపీ రఘురామకృష్ణం రాజు తో సహా ముగ్గురు టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే… మేము రాజీనామా చేస్తామని ఆయన టిడిపి నేతల సవాల్ స్వీకరిస్తున్నామని అన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలకు మేము చేసిన సేవే మమ్మల్ని గెలిపిస్తుందన్నారు. ప్రజల గుండెల్లో వైసీపీ ఉంది… కోవిడ్ కారణంగానే సీఎం సభ రద్దు అయ్యిందన్నారు. పాచిపోయిన లడ్లు జనసేన అధినేత కొణిదెల పవన్ కు ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో టిడిపి, బిజెపి లోపాయకారి ఒప్పందంతోనే పోటీ చేస్తున్నాయన్నారు. బిజెపి దిగజారి మాట్లాడుతోందని, గురుమూర్తి మతంపై బిజెపి రాష్ట్ర సహా ఇన్ ఛార్జీ సునీల్ ధియోధర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబులాగా బిజెపి నేతలు దిగజారిపోయారని, గురుమూర్తి పట్ల దారుణంగా మాట్లాడుతున్నారని రామచంద్రారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.