FbTelugu

బాబు డ్రామాలకు కాలం చెల్లింది: మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని పంచాయతీరాజ్ శాఖ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇవాళ తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగలేదని తెలిసినా.. చిత్తూరు జిల్లాలో ఏదో జరిగిపోతోందనే భ్రమలను కల్పించేందుకే చంద్రబాబు తన పర్యటన పెట్టుకున్నాడన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబుది రాజకీయ డ్రామా అని కొట్టిపారేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేస్తే.. చంద్రబాబు గాంధీ అయిపోతారా అని ప్రశ్నించారు.

చిత్తూరు జిల్లాలో ఆయన రాజకీయానికి నూకలు చెల్లిపోయాయన్నారు. ఎన్నికల కోడ్, కోవిడ్ నిబంధనలను పాటించాలని 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు. స్థానిక ఎన్నికల్లో ఓటమితో.. శాంతిభద్రతల సమస్య సృష్టించాడానికే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు.
తన అనుకూల మీడియాలో ప్రచారం కోసమే చంద్రబాబు హైడ్రామా ఆడుతున్నారు. టీడీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు కూడా అభ్యర్థులు దొరకడం లేదని, ఆయనలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే.. టీడీపీలో ఒక్కరూ మిగలరని ఆయన స్పష్టం చేశారు. వాలంటీర్లకు రాజకీయం పులమడం సరికాదన్నారు. రేపు జరగబోయే మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి కనిపిస్తోందని జోస్యం చెప్పారు. తన పార్టీ నుంచి ఎవరూ నామినేషన్లు వేసేందుకు కూడా ముందుకు రావడం లేదని పెద్దిరెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.