FbTelugu

కేంద్ర బలగాలతో పంచాయతీ ఎన్నికలు: చంద్రబాబు

అమరావతి: కేంద్ర బలగాల పర్యవేక్షణలో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని టీడీపీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరపాలని చంద్రబాబు కోరారు. నామినేషన్ కోసం వచ్చేవారిని నిరోధించేందుకు ఆన్​లైన్​లోనే నామినేషన్లు తీసుకోవాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో గ్రామ వాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించవద్దని ఎన్నికల కమిషన్ ను చంద్రబాబు కోరారు.

రాష్ట్రంలో అన్ని స్థానాలకూ తాజాగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎం జగన్ రెడ్డి కు ఏమిటి సంబంధం? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని స్పష్టం చేశారు. చెప్పుచేతల్లో ఉండే అధికారులకే ఉన్నత పదవులు ఇస్తారా? అని దుయ్యబట్టారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మిని ఏపీకీ పర్మినెంట్ గా నియమించుకుని పోస్టింగ్ ఇవ్వడమేంటని చంద్రబాబు నిలదీశారు.

అక్రమస్తుల కేసుల్లో ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. పంచాయతీ ఎన్నికలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి తనవాళ్లతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటన్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.