FbTelugu

3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు

Panchayat-elections-in-3-months

అమరావతి: మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలియచేసింది. మూడు నెలల లోపే ప్రభుత్వం ఆ ప్రకారంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. విజయవాడకు చెందిన ఎ.వేణుగోపాలకృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 59.80 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం కోటా ఉంటుందని చెప్పారు.

You might also like