FbTelugu

మళ్ళీ పంచాయతీ ఎన్నికలు

అమరావతి: నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేయని సర్పంచ్, వార్డు స్థానాలకు మరోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15న పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

గత ఎన్నికల్లో పలు కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలను ఎన్నికల సంఘానికి కలెక్టర్లు పంపించారు. వీటికి మరోసారి ఎన్నికల కోసం ప్రకటన విడుదల చేశారు. సర్పంచ్, వార్డు స్థానాలకు ఈ నెల 4 నుంచి 6 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన, 10న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించనున్నారు.
ఈ నెల 15న పోలింగ్ ముగిశాక ఓట్లు లెక్కింపు, విజేతలను ప్రకటించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.