FbTelugu

పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదల

శనివారం నుంచే ఎన్నికల కోడ్

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు

సీనియర్ అధికారులు కలిసినా ఫలితం దక్కలేదు

అమరావతి: ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) షెడ్యూలు విడుదల చేసింది.  మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

జనవరి 23వ తేదీన పంచాయతీ ఎన్నికల కోసం తొలి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4న ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5, 9, 13, 17న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

ఇవాళ సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని సీనియర్ అధికారుల బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వెళ్లి కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చర్చించింది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఫిబ్రవరికి వాయిదా వేయాలని కోరారు. కోర్టు ఆదేశాలు, నిపుణుల అభిప్రాయం తీసుకుని రమేష్ కుమార్ వారి కలిసి వెళ్లిన రెండు మూడు గంటలకే నోటిఫికేషన్ జారీ చేయడం సంచలనంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.