FbTelugu

మానవ మనుగడకు పంచభూతాలే ఆధారం: పవన్

అమరావతి: మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేనాని పలు విషయాలను వెల్లడించారు. మానవ జాతి సౌభాగ్యానికి పర్యావరణమే కారణమని, అలాంటి పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి మనుగడ సాధ్యమని అన్నారు.

పరిస్థితులు చక్కబడగానే మన నది- మన నుడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తామని అన్నారు.

You might also like