FbTelugu

పాన్ కు ఆధార్ లింక్ గడువు పెంపు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, ఐటి శాఖ సర్వర్లు పనిచేయకపోవడంతో ఆధార్ తో పాన్ కార్డు లింకేజీ గడువును జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

మార్చి 31వ లేదీలోపు పాన్ కార్డుతో ఆధార్ ను కచ్చితంగా లింక్ చేసుకోవాలని కొన్ని రోజులుగా ఆదాయపు పన్ను శాఖ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. గత రెండు రోజులు ఆదాయపు పన్ను శాఖ సర్వర్లు డౌన్ కావడంతో లింక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని పలువురు సామాజిక మాధ్యమాదల ద్వారా విన్నవించడంతో కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించక తప్పలేదు. జూన్ 30వ తేదీ లోపు లింక్ చేయనట్లయితే రూ.1 వేయి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.