FbTelugu

జనవరి 1 నుంచి పల్లెవెలుగు బస్సులు

* సంక్రాంతికి చార్జీలు 50 శాతం అదనం
విజయవాడ: కొత్తసంవత్సరం జనవరి 01 నుంచి పల్లె వెలుగు బస్సులను నడపనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయంలో మరో సారి తెలంగాణతో ఒప్పందం ఉంటుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ సంక్రాంతికి 3,607 అదనపు బస్సులను నడపనున్నట్టు తెలిపారు. అలాగే పండుగకు 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంప్లిమెంటరీ బస్ పాసులు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది సంస్థకు రూ.2,527 కోట్ల నష్టం వచ్చిందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.