FbTelugu

రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా

నల్లగొండ: నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండోసారి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై గెలుపొందారు.

చివరి రౌండ్ లో రాజేశ్వర్ రెడ్డికి 1,61,811 ఓట్లు, చింతపండు నవీన్ కు 1,49,005 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజేశ్వర్ రెడ్డి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి శనివారం రాత్రి ప్రకటించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో తొలగింపు విధానంలో తదుపరి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించారు. బరిలో 71 మంది ఉండగా, 69 మందిని తొలగించడంతో చివరకు రాజేశ్వర్ రెడ్డి, చింతపండు నవీన్ మిగిలారు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ స్థానం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయ ఢంకా మోగించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. పల్లా కు ఈ సందర్భంగా కెసిఆర్ అభినందనలు తెలిపారు. పల్లా ను గెలిపించిన గ్రాడ్యుయేట్లకు, ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన పార్టీ నాయకులను కార్యకర్తలను సిఎం అభినందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.