FbTelugu

పాక్‌ గుఢాచారి పావురం

ఇలా దొరికిపోయింది

పోలీసు కస్టడీలో బంధించిన ఈ కపోతం చూడండి. ఇది సాధారణ పావురమేమీ కాదు… మన దాయాది పాకిస్తాన్‌ శిక్షణ పొందిన గుఢాచారి పావురం. దేశ సరిహద్దులో పాకిస్తాన్‌ మన రహస్యాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక గుఢాచారి వ్యవస్థలో కపోతాలు కూడా చాలా ఉన్నాయి.

పూర్వకాలంలో రాజులు తమ పొరుగుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు కూడా ఇలానే పావురాలకు శిక్షణ ఇచ్చి వాడుకునే వారు. శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ ఇప్పుడు కూడా శత్రుదేశాలు ఇలా పావురాలతోనే గుఢాచార్యాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో మనపొరుగున ఉన్న పాకిస్తాన్‌ కూడా గుఢచర్యం కోసం ఇలానే పావురాలకు శిక్షణ ఇచ్చి మన దేశ సరిహద్దుల్లో వీటిని మోహరిస్తోంది. ఇలా శిక్షణ పొందిన ఒక పావురాన్ని సోమవారం జమ్ముకాశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారిలో హిరానగర్‌ సెక్టార్‌ వద్ద పట్టుకున్నారు. పాకిస్తాన్‌ వైపు ఎగురుతున్న ఈ పావురం ఆకస్మత్తుగా కిందపడింది. మన్యారి గ్రామస్తులు దీన్ని క్షుణంగా పరిశీలించగా పావురం కాళ్లకు చిన్న రింగ్‌ ఉండడం గమనించారు.

దీంతో స్థానికులు దీన్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ పావురాన్ని పరిశీలించగా దాని కాళ్లకు ఉన్న రింగ్‌మీద ప్రత్యేక కోడింగ్‌ ఉన్నట్లు గుర్తించారు. దృఢంగా ఉన్న ఈ పావురం పాకిస్తాన్‌ గుఢాచార కపోతంగా నిర్ధారించినట్లు కథువా ఎస్పీ శైలేంద్ర మిశ్రా ఏఎన్‌ఐ వార్త సంస్థకు తెలిపారు. ‘అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. స్థానికులు మన కంచె సమీపంలో దీనిని బంధించారు. పావురం కాలికి ఒక రింగ్ ఉంది. దాని మీద కొన్ని నంబర్లు ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్నాం” అని శైలేంద్ర మిశ్రా పేర్కొన్నారు. ”ఈ కేసులను (చొరబాట్లకు సంబంధించిన కేసులను) చూసుకునే ఆపరేషన్స్ గ్రూప్ జమ్మూకశ్మీర్‌లో ఉంది. తాజా పరిణామం గురించి వారికి సమాచారం ఇచ్చాం. వారు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు” అని మిశ్రా తెలిపారు.

గతంలోనూ ….

గతంలో కూడా భారత్- పాక్ సరిహద్దుల్లో పలుసార్లు ఇలా గూఢచార కపోతాలు మన సైన్యానికి పట్టుబడ్డాయి. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా మన్వాల్ గ్రామస్తుడు రమేశ్ చంద్.. తన ఇంటిమీదుగా వెళుతోన్న ఓ పావురాన్ని పట్టుకున్నాడు. పరీక్షించి చూడగా, దాని రెక్కలపై వేవేవో అక్షరాలు రాసున్నాయి. దీంతో అనుమానం వచ్చి స్థానిక పోలీలకు సమాచారం ఇచ్చాడు. పావురాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని రెక్కలపై ‘తహశీల్ షకార్గంజ్, జిల్లా నరోవాల్’ అని ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉండటాన్ని గుర్తించారు. అనుమానంతో సదరు పావురానికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. అయితే అనుమానిత పదార్థాలేవీ బయటపడన్నప్పటికీ పావురం రెక్కలపై ఉన్న రాతలు ఏదైనా రహస్య సమాచారానికి సంబంధించినట్లు తేల్చారు . అలాగే మూడునెలల కిందట గుజరాత్ లోని ద్వారకా జిల్లాలోనూ ఇలాంటిదే ఓ పావురం భద్రతా బలగాలకు చిక్కింది. దాని నుంచి ‘బెంజింగ్ దువాల్’ అని రాసిఉన్న ఒక ఎలక్ట్రానిక్ చిప్, ‘28733’ నంబర్ ముద్రించిన ఓ ఉంగరం, రెక్కల మధ్యలో ‘రసూల్- ఉల్- అల్లాహ్’ అని అరబిక్ భాషలో రాసిఉన్న సందేశాన్ని గుర్తించారు.

official tweet

You might also like

Leave A Reply

Your email address will not be published.