FbTelugu

పాక్ లో సోషల్ మీడియా పై వేటు

లాహోర్: పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఆదేశాలు జారీచేసింది. ఫ్రాన్స్ పత్రికలకు వ్యతిరేకంగా పాక్ లో రాడికల్ ఇస్లామిక్ పార్టీ చేపట్టిన ఆందోళనలు హింసకు దారి తీశాయి. ఫ్రాన్స్ పత్రికలు ఇస్లామ్ పై దైవ దూషణకు పాల్పడ్డాయని ఆరోపించారు.

అల్లా పై దైవ దూషణకు పాల్పడ్డాయంటూ ఆ పార్టీకి చెందిన వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి దాడులకు తెగబడ్డారు. దుకాణాలను తగులబెట్టి లూటీలకు పాల్పడ్డారు. నిరసనలు హింసాత్మంగా మారడంతో పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సోషల్ మీడియాపై వేటు వేశారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్, టెలిగ్రామ్, యూట్యూబ్ లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనకారులు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.