FbTelugu

‘ఎంఐఎం’కు ఓటేసేది పాకిస్థానీలే: బండి సంజయ్

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై చేసిన విమర్శల పట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

ఎంఐఎం కు ఓటు వేసేది పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్ వాసులేనని ఆయన ఆరోపించారు. గ్రేటర్ లో బీజేపీ విజయం సాధించగానే పాతబస్తీలో తీవ్రవాదులు, అక్రమంగా నివాసముంటున్న వారిని తరిమేస్తామని ఆయన హెచ్చరించారు. దేశ సార్వభౌమత్యాన్ని కాపాడతామని ఆయన స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.