FbTelugu

పాక్ లో కుప్ప కూలిన విమానం

లాహోర్: కరాచీ ఏయిర్ పోర్టు వద్ద విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుమారు 90 మంది ప్రయాణీకులు మృతి చెందిపట్లు సమాచారం. విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్లు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి నివాస ప్రాంతాల్లోకి దూసుకువెళ్లింది.

ఏ-320 విమానం ఒకటి రెండు నిమిషాల ముందుగా ఏయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదం సంభవించింది. విమానాశ్రయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దుర్ఘటన ప్రాంతానికి ఆర్మీ, నేవీ, అగ్నిమాపక విభాగం అధికారులు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో కమ్ముకుని పోయింది. లాహోర్ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ విమానంలో సుమారు 107 మంది ప్రయాణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.