FbTelugu

సుప్రీం తీర్పుపై పాక్ ఆక్రోశం

Pak-outrage-over-Supreme-Judgment

భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక కేసు అయోధ్యపై తీర్పును శనివారం వెల్లడించింది. కాగా దీనిపై పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్ లో మైనారిటీలకు భద్రత లేదని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మరోమారు రుజువైందని, ఈ తీర్పుతో మైనారిటీలకు అన్యాయం జరిగిందంటూ ఆరోపించింది. దీనికి సంబంధించి పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటన చేసింది. సంఘ్‌ పరివార్‌ తన హిందుత్వ ఎజెండాను అమలు చేసేందుకు చరిత్రను తిరగ రాస్తోందని ఆరోపించింది. హిందూదేశంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించింది. ఇలా మరో మారు పాక్ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది.

You might also like