FbTelugu

మరోసారి కాల్పులకు తెగబడిన పాక్

కశ్మీర్: మరోమారు కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ నీరుగార్చింది. ఇవాళ జమ్ము కశ్మీర్ లోని బాలకోట్ సెక్టార్ లో మరోసారి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు.

ఈ కాల్పుల్లో ఓ భారత జవాన్ మృతి చెందినట్టు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. ఈ ఘటనపై భారత్ కూడా తీవ్రంగా స్పందిస్తోంది.

You might also like