FbTelugu

భారత్ చుట్టుముడుతోందనే పాక్ భయం

Pak-fears-that-India-is-around

భారత్ అనుసరిస్తున్న విధానాలతో పాక్ రోజురోజుకి విలవిలలాడుతోంది. కక్షకట్టి అబాండాలు వేయాలని విఫల ప్రయత్నాలు సైతం చేస్తోంది. అయితే భారత్ అఫ్ఘనిస్థాన్ తో మైత్రి సంబంధాలు కొనసాగిస్తోంది. మంచి వాణిజ్య సంబంధాలే ఉన్నాయి. దీంతో భారత్ తమను చుట్టు ముట్టుతోందని పాక్ తీవ్ర భయాందోళనకు గురౌతోందని తాజాగా అఫ్గానిస్థాన్‌ పరిస్థితులపై అమెరికా ‘కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సర్వీస్‌(సీఆర్‌ఎస్‌)’ అందించిన స్వతంత్ర నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. ‘‘అఫ్గానిస్థాన్‌లో భారత్‌ బలమైన దౌత్య, వాణిజ్యపరమైన ఉనికిని కలిగి ఉంది. దీనికి అమెరికా మద్దతు కూడా తోడైంది. దీంతో తమ దేశాన్ని భారత్‌ వ్యూహాత్మకంగా చుట్టుముట్టేందుకు యత్నిస్తోందని పాకిస్థాన్‌ భయాందోళనకు గురవుతోంది’’ అని నివేదికలో వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్‌లో బలహీనమైన ప్రభుత్వం ఉండాలని పాక్‌ కోరుకుంటోందన్నారు. భారత్‌కు తాలిబన్లైతేనే వ్యతిరేకంగా వ్యవహరిస్తారని పాక్ భావిస్తోందని ఈ నివేధిక తెలుపుతోంది.

You might also like