FbTelugu

పాక్ దుశ్చర్య.. పాక్ మ్యాప్ లో కశ్మీర్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్దిని చాటుకుంది. పాకిస్థాన్ కొత్త మ్యాప్ ను ఆమోదించి విడుదల చేసింది. జమ్ము కశ్మీర్, లడక్ లోని పలు ప్రాంతాలు తమవిగా చూసిస్తూ మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్ పాక్ ప్రజల ఆకాంక్షలను ప్రతిభింబిస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

ఇది పాక్ చరిత్రలో కీలకమైన రోజుగా పేర్కొన్నారు. కశ్మీర్ ను తమ మ్యాప్ లో ఆజాద్ కశ్మీర్ గా పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసి జమ్ము కశ్మీర్ ను పూర్తిగా భారత్ లో కలుపుకుని ఏడాది పూర్తి అయిన తరుణంలో పాక్ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడింది.

You might also like