FbTelugu

పద్మనాభ ఆలయం రాజవంశీయులదే: సుప్రీం

ఢిల్లీ: కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం మేనేజ్‌మెంట్‌ వివాదంలో ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణను ట్రావెన్‌కోర్‌ రాజ కుటుంబానికే అప్పగించాలని స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణను ప్రభుత్వానికి అప్పగించాలని 2011లో కేరళ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్‌ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై తొమ్మిదేళ్లు విచారణ జరిపిన కోర్టు గతేడాది తీర్పును రిజర్వ్‌ చేసి.. నేడు తీర్పు వెల్లడించింది. అయితే ఈ తీర్పుపై కేరళ ప్రభుత్వం అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like