FbTelugu

ఢిల్లీలో ఆక్సిజన్‌ కరువు

దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత ఆందోళన కలిగిస్తుందట. ఇటీవల కాలంలో ఢిల్లీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. శనివారం వరకు సుమారుగా 39వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

మరో 1,271మంది మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ వేలమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో ఆస్పత్రుల్లో వీరికి చికిత్స చేయడం అక్కడ ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్‌ అందించడం కూడా కష్టమైంది. దీంతో ఢిల్లీలో ఆక్సిజన్‌ కొరత ఉండడంతో చాలామంది అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీలకు చెందిన వారు అవసరం వచ్చినప్పుడు దొరుకుతుందో లేదోనని ముందుగానే ఆక్సిజన్‌ సిలిండర్లను కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకుంటున్నారట.

ఇలా లక్షలాది ఆక్సిజన్‌ సిలిండర్లు ఢిల్లీవాసులు ఇళ్లలో స్టాక్‌ పెట్టుకుంటుండడంతో ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఏర్పడిందట. సాధారణంగా ఇలా ఆక్సిజన్‌ కొరత ఏర్పడినప్పుడు మూడు రకాలుగా ఆక్సిజన్‌ను తయారు చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలినుంచి లేదా మొలాసిస్‌ నుంచి లేదా కెమికల్స్‌ నుంచి ఆక్సిజన్‌ తయారు చేసుకోవచ్చట. అయితే, గాలినుంచి ఆక్సిజన్‌ తయారు చేసుకోవాలంటే ప్రపంచ స్థాయిలో అనుమతులు తీసుకోవాలట.

ఆ అనుమతులు రావడం కష్టమేనంటున్నారు. గాలినుంచి ఆక్సిజన్‌ను తీసుకుంటే గాలిలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గి ప్రపంచంలోని ప్రజలందరి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముంటుందట. దీంతో రెండు రకాల పద్దతులతో తయారయ్యే ఆక్సీజన్ సిలిండర్లను హాస్పిటళ్లు వినియోగిస్తున్నారు. రోగులు మున్ముందు రెట్టింపు అయ్యే అవకాశం ఉండడంతో అవసరమైన ఆక్సీజన్ దొరకడం దుర్లభం అంటున్నారు వైద్య నిపుణులు. వీటి కొరత ఏర్పడితే కరోనా రోగులతో పాటు అత్యవసర చికిత్సలకు కూడా ఇబ్చందులు రానున్నాయి.

ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కరోనా వార్డులు ఏర్పాటు చేయించింది. ఈ వార్డుల్లో బెడ్ ల సంఖ్యను కూడా రెట్టింపు చేయాలని యాజమాన్యాలను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.