FbTelugu

ఆక్సిజన్ అందక మరో 24 మంది మృతి

బెంగళూరు: ఆక్సిజన్ అందక దేశంలో ఏదో ఒక మూల కరోనా పాజిటివ్ రోగులు పిట్టల మాదిరి చనిపోతున్నారు. కర్ణాటకలో ఆదివారం సాయంత్రం ఆక్సిజన్ అందక 24 మంది కరోనా రోగులు ఐసియులో కన్నుమూశారు.

సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ శ్వాస వ్యవస్థ మీద దెబ్బకొడుతున్నది. దీంతో ఆక్సిజన్ అవసరం వీరికి ఎక్కువగా ఉంటోంది. డిమాండ్ కు సరిపడా ఆక్సిజన్ ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. చామరాజ నగర్ లోని ఒక కరోనా ఆసుపత్రిలో కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారిలో 24 మంది చనిపోయారు. ఆక్సిజన్ అందుబాటులో లేకే చనిపోయారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధం లేదని చామరాజ నగర్ డిప్యూటీ కమిషణర్ ఎం.ఆర్.రవి కొట్టి పారేశారు. ఆసుపత్రి యాజమాన్యం కూడా మృతుల బంధువుల ఆరోపణలను కొట్టిపారేసింది. ఈ ఘటన నేపథ్యంలో సిఎం యడియూరప్ప చామరాజనగర్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. కరోనా పరిస్థితి, ఆక్సిజన్ కొరతపై మంగళవారం (రేపు) క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.