FbTelugu

ఏపి విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలు

అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆక్స్ ఫ్డర్ డిక్షనరీలు ఉచితంగా అందచేస్తున్నారు. జగనన్న విద్యా కానుక పథకం కింద వీటిని అందచేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విద్యాకానుక పథకం కింద మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్స్ లు, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు ఇస్తున్నారు. అలాగే 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా పంపిణీ చేయనున్నారు. ఈ తరగతుల్లో 23,59,504 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తయారు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.731 కోట్లు మంజూరు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.