FbTelugu

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు ఓకే… త్వరలోనే ఇండియాకు…

న్యూఢిల్లీ: ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు స్పుత్నిక్, ఫైజర్, మోడెర్నా కంపెనీల వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ అంతగా ఆసక్తి వ్యక్తం చేయలేదు.

ఇవాళ యూకే ప్రభుత్వం అత్యవసర వినియోగానికి ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డు వ్యాక్సిన్ కు ఆమోద ముద్ర వేసింది. మన దేశంలో ఈ వ్యాక్సిన్ ను పూణే కు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్నది. దీనిపై ఎందుకంత ఆసక్తిగా ఉన్నారంటే పలు కారణాలు ఉన్నాయి. ఇది కరోనా వైరస్ ను న్యూమోనియా గా మారకుండా అడ్డుకుంటుంది. క్లినికల్ ట్రయల్స్ 70.4 శాతం సమర్థవంతంగా పనిచేసింది. మిగతా వ్యాక్సిన్లతో పోల్చితే సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరుచుకోవచ్చు.

మోడెర్నీ, ఫైజర్ తయారు చేసినవి అయితే మైనస్ 20 డిగ్రీల నుంచి మైనస్ 70 డిగ్రీల మధ్య భద్రపరచాల్సి ఉంటుంది. ఇది రవాణాకు కూడా అనుకూలంగా లేదు. అదే కాకుండా రెండు డోసులు రూ.1 వేయి లోపే లభ్యం కానున్నట్లు సమాచారం. ఈ లెక్కలు వేసిన భారతీయులు ఆక్స్ ఫర్డ్ తయారు చేసే కోవీషిల్డు కోసం కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆమోదం లభించడంతో త్వరలోనే భారత్ కూడా ఆమోదిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి నుంచి భారత్ లో కోవీషిల్డు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.