FbTelugu

తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్ ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా వ్యాధి సోకడంతో గత రెండు రోజులుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఉరేసుకున్నారు. 70 సంవత్సరాల హరి సింగ్ ను మంగళవారం హాస్పిటల్ లో చేర్పించారు. మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. గురువారం ఉదయం రిపోర్టు రాగానే ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనతో పాటు అల్లుడికి కూడా కరోనా సోకింది.

తిరునల్వేలిలో వందేళ్ల క్రితం ఇరుట్టు కడాయి హల్వాను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పోందింది. ఇప్పటికీ పర్యాటక కేంద్రంగా ఉందంటే కడాయి హల్వా ప్రాముఖ్యత ఎంతో అర్థమవుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.