FbTelugu

ఆస్పత్రిలో యజమాని.. పనిమనిషి 80 తులాల బంగారం స్వాహా

హైదరాబాద్: అనారోగ్యంతో ఇంటి యజమాని ఆస్పత్రిలో చేరగా.. అదే అదునుగా భావించిన ఇంటి పనిమనిషి ఇళ్లు లూటీ చేసేసింది. ఈ ఘటన నగరంలోని బర్కత్‌పురలోని గోకుల్‌దామ్‌ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గోకుల్‌దామ్‌ అపార్ట్‌మెంట్‌లో విజయ్‌కాలే, చాయకాలే దంపతులు నివాసం ఉంటున్నారు.

వారింట్లో ఈస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన నందకిషోర్‌(32) పని మనిషిగా పనిచేస్తున్నాడు. తాజాగా ఇంటి యాజమాని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఇదే అదునుగా భావించిన నందకీషోర్ ఇంట్లో 80 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.2 లక్షల నగదును దొంగిలించి పరారయ్యాడు. అలస్యంగా గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.