FbTelugu

నేడు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: ఓవైసీ

హైదరాబాద్: నేడు ప్రజాస్వామ్యానికి చీకటి రోజంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇవాళ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చేపట్టిన భూమిపూజలో ప్రధాని మోదీ పాల్గొనడం పట్ల ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూత్వాన్ని వ్యాప్తి చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోదీ మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. ప్రధాని హోదాలో రామమందిర భూమిపూజలో పాల్గొనడం తప్పుఅని అన్నారు.

You might also like