FbTelugu

అధిక బరువు… ఉద్యోగం నుంచి బర్తరఫ్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో చేసిన పనులు జనాలకు నవ్వు తెప్పించడంతో పాటు ఆగ్రహం కలిగిస్తాయి. అధిక బరువు ఉన్న కారణంగా 140 మంది విమాన సిబ్బందిని ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేశారు.
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఏయిర్ లైన్స్ లో (పిఐఏ) లో పనిచేస్తున్న సిబ్బందిలో కొంత మంది లావుగా ఉన్నారంట.

వీరిని విదేశాలకు పంపించడం మూలంగా పరువు పోతుందనేది పాకిస్థాన్ వాదన. లడ్డుగా ఉన్నవాళ్లు ఎక్కకుండా నిషేధం విధించారు. జులై నెలకు సంబంధించి డ్యూటీలో వీళ్ల పేర్లను తొలగించి ఇంటికి పంపించేశారు. ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోలేదని, కొన్ని నెలలుగా చెబుతున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతోంది. లావు తగ్గించుకోవాలని సూచించినా పెడచెవినపెట్టడంతో కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఏయిర్ లైన్స్ వెల్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.