FbTelugu

బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు… 30 మందికి గాయాలు

శ్రీకాకుళం: నందిగాం మండలం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా స్వల్ప గాయాలు ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది.

ఇవాళ ఉదయం బెంగళూరు నుండి కలకత్తా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగినట్లు ప్రయాణీకులు తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో 62 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. క్షతగాత్రులను పలాస ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.