FbTelugu

ఉంపన్ దాటికి 80 మంది మృతి

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో ఉంపన్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ దాటికి ఇప్పటివరకు 80 మంది మృతి చెందినట్టు  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 60 శాతం తుఫాను ప్రభావానికి గురైనట్టు తెలిపారు. ఈ సందర్భంగా మరికాసెపట్లో భారత ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ కు రానున్నట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

You might also like