FbTelugu

తిరుమల కంటైన్మెంట్ జోన్ పై రగడ

తిరుమల: కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో తిరుమల ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు.
కంటైన్మెంట్ జోన్ గా జిల్లా కలెక్టర్‌పై టీటీడీ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం జిల్లా కలెక్టర్ వర్సెస్ టీటీడీ ఈఓ గా మారింది.

తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ జనాలు నివాసం ఉండే ప్రాంతం కాదన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన కేసులన్నీ తిరుపతిలో నివాసం ఉండేవారివేనని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని అనుకుంటే కనీసం రెండు రోజుల ముందే మాకు సమాచారం ఇవ్వాల్సి ఉండేనని టీటీడీ అధికారులు అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.