FbTelugu

మా వ్యాక్సిన్లు డొల్ల: చైనా ప్రకటన

బీజింగ్: తాము తయారు చేసిన వ్యాక్సిన్లపై చైనా దేశం తన డొల్లతనాన్ని బయటపెట్టుకున్నది. ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలు నిజమేనంటూ స్పష్టం చేసింది.

అయితే వ్యూహాత్మకంగా ప్రకటించిందా లేదా ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ పుట్టు పూర్వోత్తరాలు బయటపడకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ను సైతం నియంత్రిస్తున్న చైనా ప్రభుత్వం ఇలా వ్యాక్సిన్ విషయం లో డొల్లతనం బయటపెట్టుకోవడం కూడా ఎత్తుగడ అయి ఉండవచ్చంటున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సామర్థ్యం తమ వ్యాక్సిన్లకు తక్కువేనని స్పష్టం చేసింది. తమ దేశం అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు మిక్స్ చేస కొత్త వ్యాక్సిన్ తయారు చేస్తామని ప్రకటించింది. సినో వ్యాక్ కు 50.4 శాతం సామర్థ్యం ఉందని బ్రెజిల్ తేల్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చైనా 34 మిలియన్ల మందికి రెండు డోసుల సినో వ్యాక్ ను ఇచ్చారు. మరో 64 మిలియన్ల మందికి సింగిల్ డోస్ ఇచ్చారు. ఇదే కాకుండా పాకిస్థాన్, నేపాల్, నార్త్ కొరియా వంటి దేశాలకు మిలియన్ డోసులను పంపించింది. చైనా ప్రకటనలో సినో వ్యాక్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అలజడి మొదలైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.