FbTelugu

అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: మంత్రి గౌతమ్

అమరావతి: అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక, వాణిజ్య, ఆర్థిక వేత్తల ఆశాకిరణం.. పెట్టుబడిదారులు నష్టపోకుండా చర్యలపై ఈ విధానం సమదృష్టి చూపనుందన్నారు.

మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో నూతన పారిశ్రామిక విధానాన్ని మంత్రి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల ప్రతిరూపమే ప్రజలు, పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసే సరికొత్త పారిశ్రామిక విధానమని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నారు.
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు (ఎమ్ఎస్ఎమ్ఈ) పెద్ద సాయంగా నిలవనుంది. పారదర్శకత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మా, టెక్స్‌టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రో కెమికల్స్‌ సహా కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మెగా ప్రాజెక్టులకు పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా అదనపు రాయితీలు ఉండనున్నాయని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.

You might also like