వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తి అట్టుకునేందుకు మూడు లక్ష్యాలపై దృష్టి సారించనున్నట్టు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జొబైడెన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశంలో కరోనా కట్టడికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. అమెరికాలో 100 రోజుల్లో 10 కోట్ల మందికి వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చూస్తామని తెలిపారు. మళ్లీ ఎప్పటిలాగనే పిల్లలు బడిబాట పట్టే రోజులు రావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.