FbTelugu

కెయు విద్యార్థి సునీల్ మృతి

హైదరాబాద్: ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చెయ్యడం లేదని నిరాశ, నిసృహలకు లోనై పురుగుల మందు తాగి, ఆత్మ హత్యా యత్నం చేసి, చికిత్స పొందుతున్న నిరుద్యోగి బోడ సునీల్ నాయక్ తనువు చాలించాడు.

పంజగుట్ట నిమ్స్ లో శుక్రవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. సునీల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, బిజెపి నాయకులు జి.వివేక్ వెంకటస్వామి నాయకులు పరామర్శించారు. త్వరగా కోలుకుని బయటకు రావాలని ఆశించారు. కాని విధి వక్రీకరించి సునీల్ శుక్రవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చనిపోయాడు. తన చావుతో నైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సునీల్ హన్మకొండలోని కెయు మైదానంలో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు . ఆ తరువాత అతన్ని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారు. బొడ సునీల్ ది మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం గుండెంగ గ్రామం తేజావత్ సింగ్ తండా.

You might also like

Leave A Reply

Your email address will not be published.