FbTelugu

పోలీసు కస్టడీకి అనాథశ్రమ నిర్వాహకులు

సంగారెడ్డి: అమీన్ పూర్ అనాథశ్రమ కేసులో వేణుగోపాల్ రెడ్డి, అతనికి సహకరించిన విజయ, జయదేవ్ లను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించడంతో ఇవాళ ఉదయం ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితులను తొలుత పటాన్ చెరు లోని ఏరియా హాస్పిటల్ లో కరోనా పరీక్షలు నిర్వహించారు.

ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, ఆశ్రమ నిర్వాహాకులకు ఎప్పటి నుంచి పరిచయాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వచ్చి వెళ్తుంటాడు, నిర్వాహకురాలు విజయతో ఉన్న సంబంధం ఏమిటనే అంశాలపై విచారించనున్నారు. విరాళాలు ఇప్పించి ఆశ్రమంలో ఒక బాలికను అత్యాచారం చేయడంతో వేణుగోపాల్ రెడ్డి మోసం వెలుగు చూసింది.
ఒక బాలికనే అత్యాచారం చేశాడా, ఇంకా ఎంతమందిని చేశాడనే దానిపై కూపి లాగనున్నారు.

You might also like