FbTelugu

ఏపిలో 590 డిగ్రీ సెక్షన్ల మూసివేతకు ఆదేశాలు

అమరావతి: ఉన్నత విద్యాశాఖ లో వింత సంస్కరణలు ప్రారంభించారు. ప్రభ్యత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులను ప్రైవేటుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా 590 సెక్షన్ల మూసివేతకు ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశారు. తక్కువ విద్యార్థులు ఉన్న కాలేజీల మూసివేతకు నిర్ణయం తీసుకున్నందున ఆ కాలేజీల్లో ని విద్యార్థులను దగ్గర్లోని ప్రైవేటు కాలేజీలకు తరలించాలని సూచించారు. డిగ్రీ ఆఖరు సెమిస్టర్ లో ఉన్న విద్యార్థులను కూడా ప్రైవేటుకు తరలించాలనుకోవడంపై ఆందోళన వెల్లువెత్తుతోంది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు దగ్గర్లో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల వివరాలు పంపాలని ఆర్.జె.డి.లని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు చేపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై డిగ్రీ కాలేజీల అధ్యాపక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.