FbTelugu

రామతీర్థంపై సీఐడి విచారణకు ఆదేశం

అమరావతి: విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహ ఖండిత ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తో పాటు బీజేపీ పార్టీ ఉద్యమించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనలో బాధ్యులైన వారిని రెండు రోజుల్లో అరెస్టు చేస్తామని మంత్రి శ్రీనివాస రావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 150 దేవాలయాపై దాడులు జరిగాయని, అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.