FbTelugu

నేడు రాష్ట్రపతిని కలవనున్న విపక్షాలు

న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై నేడు విపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ను కలవనున్నాయి. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్టు తెలిపాయి.

ఇవాళ సాయంత్రం 5:00 గంటలకు రాష్ట్రపతిని ఐదుగురు విపక్ష నేతలు కలవనున్నట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రపతిని కలవనున్నవారిలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ప్రతినిధి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఉన్నట్టుగా తెలుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.